పోలీస్‌ కేసుకు భయపడి ఆత్మహత్యాయత్నం | Man Attempts Suicide For Fear Of Police Case In Peddapalli | Sakshi
Sakshi News home page

పోలీస్‌ కేసుకు భయపడి ఆత్మహత్యాయత్నం

Sep 6 2019 11:54 AM | Updated on Sep 6 2019 11:54 AM

Man Attempts Suicide For Fear Of Police Case In Peddapalli - Sakshi

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవి

సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి మండలం గుర్రాంపల్లి గ్రామానికి చెందిన తొగరి రవి గురువారం క్రిమిసంహారకమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.. తొగరి రవి బుధవారం గ్రామంలో పైపులైన్‌ ధ్వంసం చేశాడని ఫిర్యాదు రావడంతో పెద్దపల్లి పోలీసులు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. అయితే తన కుమారుడిని ఎస్సై ఉపేందర్‌ చితకబాదడం వల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తండ్రి మధురయ్య స్థానిక డీసీపీ సుదర్శన్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు.

గ్రామంలో హనుమాన్‌ ఆలయంలో దొంగతనం జరిగిందని ఆ చోరీ కేసును ఒప్పుకోవాలంటూ ఎస్సై కొట్టాడని, దెబ్బలకు తాళలేక క్రిమిసంహారకమందు తాగాడని తండ్రి మధురయ్య డీసీపీ ఎదుట వాపోయాడు. ఈ విషయమై ఎస్సై ఉపేందర్‌ను ప్రశ్నించగా రవిపై వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బుధవారం సాయంత్రమే స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి విడుదల చేశామన్నారు. తాము ఎవరినీ చిత్రహింసలు పెట్టలేదన్నారు. ప్రస్తుతం రవి ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement