దొంగనోట్లు చెలామణి చేస్తున్న వ్యక్తి అరెస్ట్ | Man arrested by selling fake currency notes | Sakshi
Sakshi News home page

దొంగనోట్లు చెలామణి చేస్తున్న వ్యక్తి అరెస్ట్

May 3 2015 2:29 PM | Updated on Sep 3 2017 1:21 AM

ఖమ్మం నగరంలో దొంగ నోట్లు చెలామణి చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఖమ్మం: ఖమ్మం నగరంలో దొంగ నోట్లు చెలామణి చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన నజీర్ అనే వ్యక్తి బస్టాండ్ సమీపంలో దొంగ నోట్లు మార్చేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ. 25వేల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement