ఉపాధి కూలీల కడుపుకొడుతున్న కేసీఆర్‌ | mallu ravi fired on trs government | Sakshi
Sakshi News home page

ఉపాధి కూలీల కడుపుకొడుతున్న కేసీఆర్‌

Apr 1 2017 2:44 AM | Updated on Aug 14 2018 11:02 AM

ఉపాధి కూలీల కడుపుకొడుతున్న కేసీఆర్‌ - Sakshi

ఉపాధి కూలీల కడుపుకొడుతున్న కేసీఆర్‌

రాష్ట్రంలో ఉపాధి కూలీలకు నాలుగు నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా సీఎం కేసీఆర్‌ కడుపుకొడుతున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు.

టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ధ్వజం
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉపాధి కూలీలకు నాలుగు నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా సీఎం కేసీఆర్‌ కడుపుకొడుతున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. కేంద్రం ఇస్తున్న ఉపాధి హామీ నిధులను ఇతర పథకాలకు మళ్లిస్తూ కూలీలను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం స్పందించకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ధర రాకపోవడం, కొనేవారు లేకపోవడంతో మిర్చి పంటను రైతులు కాల్చివేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేకపోవడం బాధాకరమని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement