'రాష్ట్రాన్ని ఫుట్ బాల్ లా ఆడుకుంటున్నారు' | Mallu bhatti vikramarka slams kcr, chandrababu | Sakshi
Sakshi News home page

'రాష్ట్రాన్ని ఫుట్ బాల్ లా ఆడుకుంటున్నారు'

Jun 12 2015 4:24 PM | Updated on Oct 8 2018 9:21 PM

'రాష్ట్రాన్ని ఫుట్ బాల్ లా ఆడుకుంటున్నారు' - Sakshi

'రాష్ట్రాన్ని ఫుట్ బాల్ లా ఆడుకుంటున్నారు'

టీడీపీ, టీఆర్ఎస్ కుటుంబ పార్టీలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క అన్నారు.

ఖమ్మం: టీడీపీ, టీఆర్ఎస్ కుటుంబ పార్టీలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క అన్నారు. కుటుంబ పార్టీల కోసం రాష్ట్రాన్ని ఫుట్ బాల్ లా ఆడుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ ఖబర్దార్... కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేవని ఆయన హెచ్చరించారు.

ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, అడ్డదారిలో అందలం ఎక్కాలని చూడటంలో  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలేనని అంతకుముందు దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement