‘ఇప్పటిదాక తీన్మార్ చేసిన. గెలిపిస్తే మండలిలో చార్‌మార్ చూపిస్తా.. ఛాయ్‌వాలాను.
పట్టభద్రుల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి నవీన్‌కుమార్
హన్మకొండ : ‘ఇప్పటిదాక తీన్మార్ చేసిన. గెలిపిస్తే మండలిలో చార్‌మార్ చూపిస్తా.. ఛాయ్‌వాలాను. ప్రధానిని చేశారు. పేపర్‌బాయ్‌గా పనిచేసిన నన్ను ఎమ్మెల్సీగా గెలిపించండి’ అని వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి చింతపండు నవీన్‌కుమార్(తీన్మార్ మల్లన్న) పేర్కొన్నారు. గెలిపిస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు యత్నిస్తానన్నారు. హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టిన వారు గెలిచాక ఆ సొమ్మును రాబట్టుకోవడంపైనే దృష్టిపెడతారు తప్ప ప్రజల బాగోగులు పట్టించుకోరని పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్నగా ప్రతి గుడిసె, ప్రతి ఇంటిని తన బాణి, వాణితో మేల్కొలిపానన్నారు. ప్రతి పార్టీని, ప్రతి వ్యక్తిని కూడగట్టే ప్రయత్నం చేస్తున్నానని, సీఎం కేసీఆర్ మద్దతునూ కోరుతానని చెప్పారు. పట్టభద్రులంతా ఓటరుగా నమోదు కావాలని కోరారు. హెల్ప్‌లైన్ సమాచారం కోసం 98665 24314 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. నాగరాజు, ఉపేందర్, మహేందర్‌రెడ్డి, చెన్నయ్య పాల్గొన్నారు.