చేర్యాల బ్యాంకులో భారీ అగ్నిప్రమాదం | major fire accident at cheryal apgv bank | Sakshi
Sakshi News home page

చేర్యాల బ్యాంకులో భారీ అగ్నిప్రమాదం

Nov 1 2014 8:14 AM | Updated on Sep 5 2018 9:45 PM

వరంగల్ జిల్లా చేర్యాల ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకులో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి.

వరంగల్ జిల్లా చేర్యాల ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకులో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మంటలు ఎగిశాయి. అయితే అటువైపు వెళ్తున్న పోలీసు గస్తీ వాహనం గమనించి వెంటనే అగ్నిమాపక విభాగాన్ని అప్రమత్తం చేయడంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది.

కానీ అప్పటికే మంటలు తీవ్రంగా వ్యాపించాయి. బ్యాంకులో ఉన్న కంప్యూటర్లు, పేపర్లు పూర్తిగా దహనమయ్యాయి. నష్టం దాదాపు 5 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే.. ఒకవేళ పోలీసులు పట్టించుకోకపోతే మాత్రం లాకర్లలో ఉన్న నగలు, నగదు, ముఖ్యమైన పత్రాలు కూడా కాలిపోయేవని చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement