breaking news
cheryal
-
చేర్యాలలో నయీం అనుచరులు ఉన్నారా?
మండలంలో చక్కర్లు కొట్టిన కేసముద్రం పోలీసు వాహనం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం! చేర్యాల : కేసముద్రం పోలీసు వాహనం చేర్యాల మండలంలో శనివారం చక్కర్లు కొట్టింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నయీం కేసులో జిల్లాలోని కేసముద్రం మండల కేంద్రానికి చెందిన టెక్ మధును పోలీసులు 16వ నిందితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆ మండలం పరిధిలోని పోలీసులు చేర్యాలలో పర్యటించడం పలు ప్రశ్నలను రేకెత్తిస్తోంది. భూదందాలు, సెటిల్మెంట్లకు పెట్టింది పేరైన నయీం అనుచరులు చేర్యాల, మద్దూరు మండలాల్లోనూ ఉండొచ్చనే సమాచారం అందడంతో ఆ దిశగా రహస్య దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ అంతా సిట్ బృందం కనుసన్నల్లో జరుగుతోందనే అంచనాలు వెలువడుతున్నాయి. నయీం గ్యాంగ్‌తో సంబంధాలు కలిగి ఉండొచ్చని భావిం చిన పలువురిని విచారించిన పోలీసులు, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మెుత్తంమీద శనివారం చేర్యాల పోలీసు స్టేషన్లో కేసముద్రం పోలీసులు గంటపాటుగడిపారు. ఈ సమయంలో స్థానికంగా ఉన్న అనుమానితుల నేపథ్యం, నేరచరిత్ర వంటి అంశాలపై ఆరాతీసి ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారని భావిస్తున్న ఇద్దరు వ్యక్తులు మాజీ మావోయిస్టులా? ఇతర రంగాల వ్యక్తులా? అనేది తెలియరాలేదు. దీనిపై సీఐ చంద్రశేఖర్‌గౌడ్‌ను వివరణ కోరగా ‘చేర్యాల, మద్దూరు మండలాల్లో నయీం అనుచరులు ఎవ్వరూ లేరు. ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. పోలీసు వాహనం వేరే పనిపై వచ్చింది’ అని బదులిచ్చారు. -
చేర్యాల బ్యాంకులో భారీ అగ్నిప్రమాదం
వరంగల్ జిల్లా చేర్యాల ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకులో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మంటలు ఎగిశాయి. అయితే అటువైపు వెళ్తున్న పోలీసు గస్తీ వాహనం గమనించి వెంటనే అగ్నిమాపక విభాగాన్ని అప్రమత్తం చేయడంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది. కానీ అప్పటికే మంటలు తీవ్రంగా వ్యాపించాయి. బ్యాంకులో ఉన్న కంప్యూటర్లు, పేపర్లు పూర్తిగా దహనమయ్యాయి. నష్టం దాదాపు 5 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే.. ఒకవేళ పోలీసులు పట్టించుకోకపోతే మాత్రం లాకర్లలో ఉన్న నగలు, నగదు, ముఖ్యమైన పత్రాలు కూడా కాలిపోయేవని చెబుతున్నారు.