చేర్యాలలో నయీం అనుచరులు ఉన్నారా? | is there any followers of nayeem at cheryal? | Sakshi
Sakshi News home page

చేర్యాలలో నయీం అనుచరులు ఉన్నారా?

Aug 13 2016 11:31 PM | Updated on Aug 21 2018 8:06 PM

కేసముద్రం పోలీసు వాహనం చేర్యాల మండలంలో శనివారం చక్కర్లు కొట్టింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నయీం కేసులో జిల్లాలోని కేసముద్రం మండల కేంద్రానికి చెందిన టెక్‌ మధును పోలీసులు 16వ నిందితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆ మండలం పరిధిలోని పోలీసులు చేర్యాలలో పర్యటించడం పలు ప్రశ్నలను రేకెత్తిస్తోంది.

  • మండలంలో చక్కర్లు కొట్టిన కేసముద్రం పోలీసు వాహనం 
  • ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం!
  •  
    చేర్యాల : కేసముద్రం పోలీసు వాహనం చేర్యాల మండలంలో శనివారం చక్కర్లు కొట్టింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నయీం కేసులో జిల్లాలోని కేసముద్రం మండల కేంద్రానికి చెందిన టెక్‌ మధును పోలీసులు 16వ నిందితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆ మండలం పరిధిలోని పోలీసులు చేర్యాలలో పర్యటించడం పలు ప్రశ్నలను రేకెత్తిస్తోంది. భూదందాలు, సెటిల్మెంట్లకు పెట్టింది పేరైన నయీం అనుచరులు చేర్యాల, మద్దూరు మండలాల్లోనూ ఉండొచ్చనే సమాచారం అందడంతో ఆ దిశగా రహస్య దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ అంతా సిట్‌ బృందం కనుసన్నల్లో జరుగుతోందనే అంచనాలు వెలువడుతున్నాయి. నయీం గ్యాంగ్‌తో సంబంధాలు కలిగి ఉండొచ్చని భావిం చిన పలువురిని విచారించిన పోలీసులు, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మెుత్తంమీద శనివారం చేర్యాల పోలీసు స్టేషన్‌లో కేసముద్రం పోలీసులు గంటపాటుగడిపారు. ఈ సమయంలో స్థానికంగా ఉన్న అనుమానితుల నేపథ్యం, నేరచరిత్ర వంటి అంశాలపై ఆరాతీసి ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారని భావిస్తున్న ఇద్దరు వ్యక్తులు మాజీ మావోయిస్టులా? ఇతర రంగాల వ్యక్తులా? అనేది తెలియరాలేదు. దీనిపై సీఐ చంద్రశేఖర్‌గౌడ్‌ను వివరణ కోరగా ‘చేర్యాల, మద్దూరు మండలాల్లో నయీం అనుచరులు ఎవ్వరూ లేరు. ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. పోలీసు వాహనం వేరే పనిపై వచ్చింది’ అని బదులిచ్చారు. 
     
      

Advertisement
 
Advertisement
Advertisement