ప్రేమ విఫలమై... 

Lovers Suicide Attempt In Warangal - Sakshi

వర్ధన్నపేట: యువతి యువకుడు ప్రేమించుకుని ఆ ప్రేమ విఫలమై యువతి ఇంటిలోకి వెళ్లిన ఆ యువకుడు కాలిన గాయాలతో బయటకు రావడం, యువతిపై కిరోసిన్‌ పడి ప్రమాదం నుంచి తప్పించుకున్న సంఘటన బుధవారం సాయంత్రం మండలంలోని దమ్మన్నపేటలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన యువకుడు దుబ్బ యాకయ్య అదే గ్రామానికి చెందిన యువతి గత కొందీ కాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా ఇటీవల ఇరువరి మధ్య మనస్పర్ధలు ఏర్పడడంతో పెద్ద మనుషుల సమక్షంలో ఎవరికీ సంబంధం లేకుండా తీర్మానం చేసినట్లు సమాచారం.

ఈ క్రమంలో బుధవారం యువతి ఇంటికి వెళ్లిన యువకుడి వంటిపై కిరోసిన్‌తో మంటలు అంటుకోగా యువతి వంటిపై కూడా కిరోసిన్‌ పడింది. అయితే ఈ ఘటనలో యువకుడు యువతిపై కిరోసిన్‌ పోసి నిప్పంటిచే ప్రయత్నం చేశాడా.. లేక యువతి ఆ పని చేసిందా.. అనే విషయం పోలీసు విచారణలో స్పష్టం కానుంది. మంటలతో గాయపడిన  యువకుడు యాకయ్యను హుటాహుటిన 108 వాహనంలో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంపై పోలీస్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేయగా తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top