ప్రేమికుల ఆత్మహత్యాయత్నం | Lovers attempt suicide | Sakshi
Sakshi News home page

ప్రేమికుల ఆత్మహత్యాయత్నం

Oct 26 2015 3:43 PM | Updated on Sep 3 2017 11:31 AM

ప్రేమికులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఖమ్మం జిల్లా ఇల్లందులో సోమవారం చోటుచేసుకుంది.

ఇల్లందు (ఖమ్మం) :  ప్రేమికులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఖమ్మం జిల్లా ఇల్లందులో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని రేపల్లెవాడ గ్రామానికి చెందిన అజ్మీరా విజయ్ కుమార్(19), బానోతు తేజస్విని(18) స్థానిక డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

కాగా సోమవారం ఉదయం కళాశాలకని బయలుదేరిన వీరిద్దరూ ఇల్లందులోని బొగ్గు రవాణాకు ఉపయోగించే రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న పొదల్లో పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ విషయాన్ని విజయ్ కుమార్ తన సోదరుడికి తెలుపడంతో.. అతను సంఘటనా స్థలానికి చేరుకొని వారిని స్థానిక ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. కాగా ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement