పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట | Lovers approach police for protection | Sakshi
Sakshi News home page

పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

Apr 1 2016 8:00 PM | Updated on Sep 3 2017 9:01 PM

ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట రక్షణ కోసం శుక్రవారం మెదక్ జిల్లా తోగుట పోలీసులను ఆశ్రయించింది.

తోగుట (మెదక్): ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట రక్షణ కోసం శుక్రవారం మెదక్ జిల్లా తోగుట పోలీసులను ఆశ్రయించింది. మండల పరిధిలోని పెద్దమాసాన్‌పల్లికి చెందిన దోసపల్లి అనిల్‌ కుమార్(25), సిద్దిపేట పట్టణానికి చెందిన పెర్క జ్యోతి (21) నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు అంగీకరించరని భావించిన ప్రేమికులు మార్చి 30న హైదరాబాద్ సుల్తాన్‌బజారులో ఉన్న ఆర్య సమాజ్ మందిరంలో వివాహం చేసుకున్నారు. రక్షణ కోసం శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. తొగుట సీఐ వెంకటయ్య ఇరువువురి తల్లిదండ్రులను పిలిపించి రాజీ కుదిర్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement