పెళ్లికి పెద్దలు అంగీకరించరని.. | Love couple to commit suicide | Sakshi
Sakshi News home page

పెళ్లికి పెద్దలు అంగీకరించరని..

Nov 21 2014 1:56 AM | Updated on Sep 2 2017 4:49 PM

పెళ్లికి పెద్దలు అంగీకరించరని భావించి ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి ప్పాలడింది. ఈ ఘటన చిట్యాలలో గురువారం చోటు చేసుకుంది.

 చిట్యాల : పెళ్లికి పెద్దలు అంగీకరించరని భావించి ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి ప్పాలడింది. ఈ ఘటన చిట్యాలలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు  తెలిపిన వివరాల ప్రకారం..నార్కట్‌పల్లి మండలం గోపాలయపల్లి గ్రామానికి చెందిన దేశగోని ప్రసాద్ ఆ గ్రామ శివారులోని రసాయన పరిశ్రమలో పనిచేస్తున్నాడు.  ఇతను చిట్యాలలో డిగ్రీ చదువుతున్న రామన్నపేట మండలం ఉత్తటూరు గ్రామానికి చెందిన కోళ్ల సంధ్య రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించరని భావించి  సాయంత్రం చిట్యాల రైల్వేస్టేషన్ సమీపంలోకి చేరుకుని పురుగుల మందు తాగారు. గుర్తించిన స్థాని కు లు, ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చా రు. వారిని చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉందని తెలుపటంతో మైరుగైన చికిత్స కో సం నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.  చిట్యాల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement