రాజీవ్ రహదారిపై లారీ బీభత్సం | lorry accident at national high way | Sakshi
Sakshi News home page

రాజీవ్ రహదారిపై లారీ బీభత్సం

Nov 20 2015 1:01 PM | Updated on Sep 3 2017 12:46 PM

కరీంనగర్ జిల్లా గోదావరిఖని సమీపంలో రాజీవ్ రహదారిపై ఓ లారీ శుక్రవారం ఉదయం బీభత్సం సృష్టించింది.

కోల్‌సిటీ: కరీంనగర్ జిల్లా గోదావరిఖని సమీపంలో రాజీవ్ రహదారిపై ఓ లారీ శుక్రవారం ఉదయం బీభత్సం సృష్టించింది. ఐరన్‌లోడ్‌తో చంద్రాపూర్ నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న లారీ గోదావరిఖని సమీపంలో చక్రం ఊడిపోవడంతో అదుపుతప్పింది. దీంతో డివైడర్‌ను ఢీకొని పక్కనే ఉన్న సర్వీసు రోడ్డు లోకి దూసుకెళ్లింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రమాదం జరగడం, అయితే ఆ సయయంలో ఎలాంటి వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement