కరోనా: క్యూలైన్‌‌ చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే! | Long Quelines To Withdraw Government Aid Money In Telangana | Sakshi
Sakshi News home page

ఎర్రటి ఎండలో.. బ్యాంకుల వద్ద పరిస్థితి ఇదే!

Apr 18 2020 2:36 PM | Updated on Apr 18 2020 3:02 PM

Long Quelines To Withdraw Government Aid Money In Telangana - Sakshi

వందలాది మంది సొమ్ము విత్‌ డ్రా కోసం ఎర్రటి ఎండలో బారులు తీరుతూ ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నారు.

సాక్షి, వికారాబాద్‌: ప్రభుత్వం ప్రకటించిన కరోనా సాయాన్ని తీసుకునేందుకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఖాతాల్లో జమ అయిన రూ.1500 కోసం బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. కరోనా భయాల నేపథ్యంలో డబ్బుల కోసం బ్యాంకులకు వెళ్లిన ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ వరుసల్లో నిలుచోవడంతో కిలోమీటర్ల మేర క్యూలైన్లు ఏర్పడుతున్నాయి. మీరు ఈ వీడియోలో చూస్తున్న దృశ్యాలు.. వికారాబాద్‌ జిల్లాలోని ధరూరు మండల కేంద్రం ఎస్‌బీఐ ధరూర్‌ శాఖ వద్ద రోడ్డుకు ఇరువైపులా మహిళలు వరుసలో నిలుచున్నవి. అయితే, వందలాది మంది సొమ్ము విత్‌ డ్రా కోసం ఎర్రటి ఎండలో బారులు తీరుతూ ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నారు. ఈక్రమంలోనే కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కేంద్రంలో నానోత్‌ కమల (45) అనే మహిళ శుక్రవారం గుండెపోటుకు గురై మృతి చెందారు. కరోనా ఆర్థిక సాయం కోసం తెలంగాణ గ్రామీణ బ్యాంకు వద్ద  ఆమె క్యూలైన్లో నిలుచుండగా ఘటన జరిగింది.
(చదవండి: గాంధీలో డ్యూటీ.. కానిస్టేబుల్‌కు కరోనా!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement