తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల సంఖ్యను సర్ధుబాటు చేస్తూ కేంద్ర హోం శాఖ మంగళవారం గెజిట్ విడుదల చేసింది
హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల సంఖ్యను సర్ధుబాటు చేస్తూ కేంద్ర హోం శాఖ మంగళవారం గెజిట్ విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రంగారెడ్డి,మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలో ఒక్కో ఎమ్మెల్సీ స్ధానం పెరిగింది.
విభజన చట్టంలో తెలంగాణకు 40 ఎమ్మెల్సీ సీట్లు కేటాయించారు. వాటిలో 14 స్థానిక సంస్ధల ఎమ్మెల్సీ కోటా ఉండాల్సి వుండగా ప్రస్తుతం కేవలం 11 ఎమ్మెల్సీ సీట్లు మాత్రమే వున్న నేపథ్యంలో 3 స్థానాలను పెంచారు. త్వరలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.