‘కిరాతకుడిని ఉరి తీయండి’ | Lingam Nayee Demand Hang Rapist | Sakshi
Sakshi News home page

‘కిరాతకుడిని ఉరి తీయండి’

Jun 21 2019 2:50 PM | Updated on Jun 21 2019 2:50 PM

Lingam Nayee Demand Hang Rapist - Sakshi

మద్దికుంట లింగం నాయీ

పసిపాపను పైశాచికంగా హత్య చేసిన దుర్మార్గుడిని ఉరి తీయాలని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక చేసింది.

సాక్షి, హైదరాబాద్‌: హన్మకొండలో ముక్కుపచ్చలారని పసిపాపను పైశాచికంగా హత్య చేసిన దుర్మార్గుడిని ఉరి తీయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షులు మద్దికుంట లింగం నాయీ డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి, అన్నివిధాలుగా అండదండలు అందించాలని ఇవ్వాలని కోరారు. ఊహించని విధంగా కూతురిని కోల్పోయి పుట్టేడు శోకంలో ఉన్న బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

కాగా, వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలో మంగళవారం చోటుచేసుకున్న దారుణోదంతంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 9 నెలల పసికందుపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన కిరాతకుడు ప్రవీణ్‌ను కఠినంగా శిక్షించాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కొవ్వొత్తుల ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement