20న ఛాతి ఆసుపత్రి ఎదుట లెఫ్ట్ ధర్నా | left parties take a strike on 2oth at chest hospital | Sakshi
Sakshi News home page

20న ఛాతి ఆసుపత్రి ఎదుట లెఫ్ట్ ధర్నా

Feb 14 2015 3:52 AM | Updated on Sep 2 2017 9:16 PM

వాస్తు పేరుతో ఛాతి ఆసుపత్రిని కూల్చి, అక్కడ సచివాలయాన్ని ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 20న ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రి వద్ద ధర్నా చేయాలని పది వామపక్షాలు నిర్ణయించాయి.

సాక్షి, హైదరాబాద్: వాస్తు పేరుతో ఛాతి ఆసుపత్రిని కూల్చి, అక్కడ సచివాలయాన్ని ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 20న ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రి వద్ద ధర్నా చేయాలని పది వామపక్షాలు నిర్ణయించాయి. ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నందుకు నిరసనగానే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించాయి.

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ  మార్చి  8-20 తేదీల మధ్య రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ, వాడవాడలా సమావేశాలు పెట్టి పాలకుల నిర్ణయాలను ఎండగడతామని తెలిపాయి. సామ్రాజ్యవాద, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా కవులు,కళాకారులు చేపట్టిన చలో బైరాన్‌పల్లి అమరవీరుల నివాళి, కళాకారుల సమైక్యగానంలో వామపక్షాలు పాలుపంచుకోవాలని నిర్ణయించినట్లు తెలియజేశాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement