నేటి నుంచి లాసెట్‌ వెబ్‌ ఆప్షన్లు | lawcet web options start from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి లాసెట్‌ వెబ్‌ ఆప్షన్లు

Oct 28 2017 1:59 AM | Updated on Oct 28 2017 2:00 AM

lawcet web options start from today

సాక్షి, హైదరాబాద్‌: న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం శనివారం నుంచి వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు లాసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఎంవీ రంగారావు తెలిపారు. ఈ నెల 20 నుంచి 23 వరకు చేపట్టిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 7,630 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. వారంతా ఈ నెల 28 నుంచి 31 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని సూచించారు. ఎట్టకేలకు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) లా కాలేజీల్లో ప్రవేశాలకు అనుమతులు ఇవ్వడంతో వెబ్‌ ఆప్షన్లకు ప్రవేశాల కమిటీ చర్యలు చేపట్టింది.

మొత్తంగా 47 కాలేజీల్లో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో కన్వీనర్‌ కోటా కింద 4,358 సీట్లు అందుబాటులో ఉన్నట్లు రంగారావు వెల్లడించారు. అందులో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కాలేజీలు 20 ఉండగా, వాటిల్లో 2,738 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సును నిర్వహించే 13 కాలేజీల్లో 1,064 సీట్లు, ఎల్‌ఎల్‌ఎం కోర్సు నిర్వహించే మరో 14 కాలేజీల్లో 556 సీట్లు ఉన్నట్లు వివరించారు. వెబ్‌ ఆప్షన్లు, కాలేజీల వివరాలను http://lawcetadm.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో పొందవచ్చని వెల్లడించారు. వెబ్‌ ఆప్షన్ల తర్వాత సీట్లను కేటాయిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement