breaking news
Lawcet - 2017
-
నేటి నుంచి లాసెట్ వెబ్ ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం శనివారం నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎంవీ రంగారావు తెలిపారు. ఈ నెల 20 నుంచి 23 వరకు చేపట్టిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 7,630 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. వారంతా ఈ నెల 28 నుంచి 31 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని సూచించారు. ఎట్టకేలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) లా కాలేజీల్లో ప్రవేశాలకు అనుమతులు ఇవ్వడంతో వెబ్ ఆప్షన్లకు ప్రవేశాల కమిటీ చర్యలు చేపట్టింది. మొత్తంగా 47 కాలేజీల్లో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో కన్వీనర్ కోటా కింద 4,358 సీట్లు అందుబాటులో ఉన్నట్లు రంగారావు వెల్లడించారు. అందులో మూడేళ్ల ఎల్ఎల్బీ కాలేజీలు 20 ఉండగా, వాటిల్లో 2,738 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్సును నిర్వహించే 13 కాలేజీల్లో 1,064 సీట్లు, ఎల్ఎల్ఎం కోర్సు నిర్వహించే మరో 14 కాలేజీల్లో 556 సీట్లు ఉన్నట్లు వివరించారు. వెబ్ ఆప్షన్లు, కాలేజీల వివరాలను http://lawcetadm.tsche.ac.in/ వెబ్సైట్లో పొందవచ్చని వెల్లడించారు. వెబ్ ఆప్షన్ల తర్వాత సీట్లను కేటాయిస్తామని పేర్కొన్నారు. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
లాసెట్– 2017కు ఏర్పాట్లు పూర్తి హైదరాబాద్: ఈ నెల 27న జరిగే లాసెట్– 2017కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రీజినల్ కన్వీనర్ డాక్టర్ వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. అభ్యర్థులు నెట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఉదయం 10 నుంచి 11.30 వరకు జరిగే ఎల్ఎల్బీ 3, 5 సంవత్సరాల ప్రవేశ పరీక్షలకు, మధ్యాహ్నం 2.30 నుంచి 4 వరకు జరిగే ఎల్ఎల్ఎం ప్రవేశ పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని చెప్పారు. జంటనగరాల్లో ఏర్పాటు చేసిన 16 కేంద్రాల్లో 9,200 మంది అభ్యర్థులు లాసెట్‌కు హాజరుకానున్నట్లు వివరించారు. హాజరు కోసం బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు.