నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ | No entry if minute delayed | Sakshi
Sakshi News home page

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

May 25 2017 12:15 AM | Updated on Sep 5 2017 11:54 AM

ఈ నెల 27న జరిగే లాసెట్‌– 2017కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రీజినల్‌ కన్వీనర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు.

లాసెట్‌– 2017కు ఏర్పాట్లు పూర్తి   

హైదరాబాద్‌: ఈ నెల 27న జరిగే లాసెట్‌– 2017కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రీజినల్‌ కన్వీనర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. అభ్యర్థులు నెట్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. ఉదయం 10 నుంచి 11.30 వరకు జరిగే ఎల్‌ఎల్‌బీ 3, 5 సంవత్సరాల ప్రవేశ పరీక్షలకు, మధ్యాహ్నం 2.30 నుంచి 4 వరకు జరిగే ఎల్‌ఎల్‌ఎం ప్రవేశ పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని చెప్పారు.

జంటనగరాల్లో ఏర్పాటు చేసిన 16 కేంద్రాల్లో 9,200 మంది అభ్యర్థులు లాసెట్‌కు హాజరుకానున్నట్లు వివరించారు. హాజరు కోసం బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement