ఆధార్ లాక్.. డేటా సేఫ్: ఇదిగో టిప్స్ | How To Lock Or Unlock Your Aadhaar Biometrics Online Heres A Step By Step Guide To Securing Fingerprint | Sakshi
Sakshi News home page

ఆధార్ లాక్.. డేటా సేఫ్: ఇదిగో టిప్స్

May 29 2025 6:29 PM | Updated on May 29 2025 7:39 PM

How To Lock Or Unlock Your Aadhaar Biometrics Online Heres A Step By Step Guide To Securing Fingerprint

డిజిటల్ ప్రపంచంలో.. సైబర్ మోసగాళ్లు ఎప్పుడు మన డేటా దొంగలిస్తున్నారో తెలుసుకోవడం కష్టమైపోతోంది. ఇలాంటి సమయంలో ఆధార్ కార్డును సురక్షితంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌లు, ఫేస్ స్కాన్ వంటి సున్నితమైన సమాచారంతో అనుసంధానించబడి ఉండటంతో.. చిన్న లోపం కూడా పెద్ద దుర్వినియోగానికి దారితీస్తుంది. ఆధార్ కార్డు భద్రత కోసం బయోమెట్రిక్ లాక్ చాలా ముఖ్యం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆధార్ బయోమెట్రిక్‌ను ఆన్‌లైన్‌లో లాక్ చేయడం ఎలా?
మీ ఆధార్ బయోమెట్రిక్స్‌ను లాక్ చేయాలనుకుంటే.. మీకు ముందుగా వర్చువల్ ఐడీ (VID) అవసరం. మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆధార్ సర్వీసెస్ అనే విభాగంలో 'వర్చువల్ ఐడి జనరేటర్' ట్యాబ్‌పై క్లిక్ చేయడం ద్వారా మీ ఆధార్ వర్చువల్ ఐడిని జనరేట్ చేసుకోవచ్చు.

వర్చువల్ ఐడీని క్రియేట్ చేసుకున్న తరువాత.. ఆధార్ బయోమెట్రిక్స్‌ను ఆన్‌లైన్‌లో లాక్ చేయడం కోసం కింద పేర్కొన్న స్టెప్స్ ఫాలో అవ్వండి..

➤యూఐడీఏఐ మైఆధార్ పోర్టల్‌కి వెళ్లండి.
➤ఆధార్ సర్వీస్ విభాగంలో కనిపించే 'లాక్/అన్‌లాక్ ఆధార్' ఆప్షన్ క్లిక్ చేయండి.
➤అక్కడ కనిపించే సూచనలను జాగ్రత్తగా చదివి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి.
➤సూచనల తరువాత మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే.. ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ వర్చువల్ ఐడీ నెంబర్, పూర్తి పేరు, పిన్ కోడ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తరువాత సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి.
➤క్లిక్ చేసిన తరువాత రిజిస్టర్ మొబైల్ నెంబరుకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇలా చేసిన తరువాత మీ ఆధార్ బయోమెట్రిక్ విజవంతంగా లాక్ అవుతుంది. అన్‌లాక్ చేయడానికి కూడా ఇదే దశలను 'అన్‌లాక్ ఆధార్' ఆప్షన్ మీద క్లిక్ చేసి పూర్తిచేయాలి.

బయోమెట్రిక్ లాకింగ్ ఉద్దేశ్యం 
ఆధార్ లాక్‌ని యాక్టివేట్ చేస్తే.. మీ అనుమతి లేకుండా ఎవరూ మీ బయోమెట్రిక్ డేటాను ఉపయోగించలేరు. గుర్తింపు ధృవీకరణ, ఆర్థిక లావాదేవీలు లేదా సిమ్ కార్డ్ జారీ కోసం అయినా, మీ ఆమోదం తప్పనిసరి అవుతుంది.

ఆధార్‌ను పాన్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు, ఓటరు ఐడీలు (కొన్ని రాష్ట్రాల్లో), రేషన్ కార్డులు, మొబైల్ నెంబర్‌ల వంటి కీలక డాక్యుమెంట్లకు లింక్ చేస్తున్నారు. ఈ అనుసంధానం.. గుర్తింపు ధృవీకరణను క్రమబద్ధీకరించడానికి, మోసాన్ని తగ్గించడానికి, అర్హత కలిగిన లబ్ధిదారులకు ప్రభుత్వ సేవలు లేదా సబ్సిడీలను సమర్థవంతంగా అందించడంలో సహాయపడుతుంది. కాబట్టి అలాంటి ఆధార్ డేటాను కొందరు సైబర్ నేరగాళ్లు.. మోసం చేయడానికి ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఆధార్ లాక్ చాలా అవసరం.

ఇదీ చదవండి: అగ్ని ప్రమాదంలో నష్టపోయారా?: ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ ఇదే..

ఆధార్ లాక్ చేస్తే.. మీ అనుమతి లేకుండా వేలిముద్రలు & ఐరిస్ స్కాన్‌ వంటి వాటిని ద్రువీకరించలేరు. మీరు అన్‌లాక్ చేయనంత వరకు మీ ప్రమేయం లేకుండా ఆధార్ వివరాలు భద్రంగా ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement