కేసీఆర్కు లక్ష్మీపార్వతి లేఖ | Lakshmi parvathi letter to cm kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్కు లక్ష్మీపార్వతి లేఖ

Nov 28 2014 1:03 PM | Updated on Aug 15 2018 9:22 PM

కేసీఆర్కు లక్ష్మీపార్వతి లేఖ - Sakshi

కేసీఆర్కు లక్ష్మీపార్వతి లేఖ

ముఖ్యమంత్రి కేసీఆర్కు శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మీపార్వతి లేఖ రాశారు.

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్కు శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మీపార్వతి లేఖ రాశారు. ఎన్టీఆర్ మరణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆమె తన లేఖలో కోరారు.

 

''కుట్ర, మోసంతో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి...ఆయన మరణానికి చంద్రబాబు కారకులయ్యారు. నెపం నాపై నెట్టి నన్ను దోషిగా చూపే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ మరణం వెనుక వాస్తవాలు ప్రపంచానికి తెలియాలి?. కేసీఆర్ మీరు ...ఎన్టీఆర్ శిష్యుడిగా నా అభ్యర్థనను మన్నించండి. చంద్రబాబు ఓ వర్గం మీడియాను అడ్డు పెట్టుకుని వాస్తవాలు కప్పిపుచ్చారు. శంషాబాద్ దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరే కొనసాగించండి'' అని లక్ష్మీ పార్వతి లేఖ ద్వారా కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement