ఎన్నికల్లో ఇచ్చిన హమీలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు.
హమీలు గాలికొదిలేశారు: లక్ష్మణ్
Mar 9 2017 9:10 AM | Updated on Mar 29 2019 9:07 PM
యాదాద్రి: ఎన్నికల్లో ఇచ్చిన హమీలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. భూపాలపల్లిలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై నిరసన ర్యాలీకి వెళ్లారు. ఆయన జిల్లాలోని భువనగిరి మండలం రాయగిరిలోని సంకల్ప్ హోటల్‌లో గురువారం ఉదయం విలేకరులతో మాట్లాడారు.
కేసీఆర్ సర్కార్ ప్రజా వ్యతిరేక విదానాలను అవలంభిస్తోందని, వీటిపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో బీజేపీ ఎప్పుడు ముందుటుందని తెలిపారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్ ఇప్పుడు ఆ హామీని గాలికొదిలేశారని ఎద్దేవ చేశారు.
Advertisement
Advertisement