స్నేహితురాలు.. ఘరానా చోరీ | lady theft gold and items in her friend home | Sakshi
Sakshi News home page

స్నేహితురాలు.. ఘరానా చోరీ

Feb 13 2015 1:28 AM | Updated on Sep 2 2017 9:12 PM

కొంతకాలంగా తనతో పాటు కలిసి ఉంటున్న స్నేహితురాలిని నమ్మి సొంత ఊరుకు వెళితే, స్నేహితురాలు రూ.లక్షల విలువైన వస్తువులతో ఉడాయించిన సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.

హైదరాబాద్ సిటీ: కొంతకాలంగా తనతో పాటు కలిసి ఉంటున్న స్నేహితురాలిని నమ్మి సొంత ఊరుకు వెళితే,  స్నేహితురాలు రూ.లక్షల విలువైన వస్తువులతో ఉడాయించిన సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. గురువారం ఆల్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజస్తాన్‌కు చెందిన దేవికాశర్మ తల్లిదండ్రులు చనిపోవడంతో 2 సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి ఝాన్సీ బజార్‌లో బ్యూటీపార్లర్ నడుపుతోంది. అయితే పూనేకు చెందిన హాస్మాఖాన్ బ్యూటీపార్లర్‌కు వచ్చేది. ఇద్దరి మధ్య స్నేహం పెరిగి 2 సంవత్సరాలుగా రాజేంద్రనగర్‌లో వ్యభిచార గృహం నడిపిన కేసులో జైలుకు వెళ్లి వచ్చారు. వీరిద్దరు బ్యూటీ పార్లర్ నడిపే యువతి సొంత ఊరుకు వెళ్లగా రూ.6 లక్షల ఖరీదైన బంగారం, ఇంట్లోని సామాగ్రితో పాటు మరో స్నేహితురాలు ఉడాయించింది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement