సాంస్కృతిక ఆయుధంగా బతుకమ్మ: కేటీఆర్‌

KTR Praises Kavitha Over Bathukamma Festival - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రకృతితో ముడిపడిన బతుకమ్మ పండుగను స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో సాంస్కృతిక ఆయుధంగా, విడదీయలేని ఉద్యమరూపంగా మార్చిన ఘనత తెలంగాణ జాగృతికే దక్కుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రశంసించారు. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తి చేయడంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కృషిని కొనియాడుతూ జాగృతి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ట్విట్టర్‌లో బుధవారం కేటీఆర్‌ వీడియో సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మను నిషేధించిన సందర్భంలో హైకోర్టుకు వెళ్లి మరీ తెలంగాణ జాగృతి అనుమతి సాధించి వేడుకలు నిర్వహించిందని గుర్తు చేశారు. తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను దశాబ్ద కాలంగా జాగృతి ప్రజల్లోకి తీసుకెళ్లిన విధానం అద్భుతమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ పేర్కొన్నారు. మలిదశ ఉద్యమంలో మహిళలను భాగస్వాములుగా చేసింది తెలంగాణ జాగృతేనని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మెచ్చుకున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top