
‘కొప్పుల’ కంటతడి
టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, వికారాబాద్ జిల్లా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి పార్టీ శ్రేణుల సాక్షిగా కంటతడి పెట్టారు.
టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదులో హరీశ్వర్‌రెడ్డి భావోద్వేగం
పరిగి: టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, వికారాబాద్ జిల్లా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి పార్టీ శ్రేణుల సాక్షిగా కంటతడి పెట్టారు. పరిగిలో శనివారం నిర్వ హించిన పార్టీ సభ్యత్వ నమోదులో నాయ కులు, కార్యకర్తలు అధిష్ఠానం తీరుపై విమర్శ నాస్త్రాలు సంధించారు. ఉద్యమదశ నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి, తమను ముందుండి నడిపించిన నేతను గుర్తించక పోవడం బాధాకరమని అసంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం వేల సంఖ్యలో హాజరైన కార్యకర్తలనుద్దేశించి హరీశ్వర్‌రెడ్డి మాట్లాడు తూ.. ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. తనకేపదవి వద్దని, కార్యకర్తల అభిమానం ఉంటే చాలంటూ కంటతడిపెట్టారు. సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని, పదవి రానందుకు నిరుత్సాహ పడొద్దని మరింత కసితో పని చేద్దాం.. అంటూ కార్యకర్తల కు పిలుపునిచ్చారు. అంతకు ముందు మాట్లాడిన పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సైతం హరీశ్వర్‌రెడ్డికి పదవి దక్కకపోవడం బాధ కలిగించిందన్నారు.
టీడీపీతో విభేదించి..
తెలంగాణ ఉద్యమం సమయంలో చంద్ర బాబుతో విభేదించిన హరీశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్ గూటికి చేరారు. ఉద్యమంతో పాటు ఎన్నికల సమయంలో పార్టీ తరఫున పెద్దన్న పాత్ర పోషించారు. అయితే, అనూహ్య పరిణామా లతో ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అయినప్ప టికీ ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో తాజా నామినేటెడ్ పదవుల్లోనైనా ఏదో ఒకటి దక్కుతుందని ఆశించి భంగపడ్డారు.