breaking news
KOPPULA harisvar Reddy
-
తనయుడి కోసం మాతృమూర్తి ఎన్నికల ప్రచారం
రంగారెడ్డి/ పరిగి: తనయుడి కోసం ఆ మాతృమూర్తి ఎన్నికల ప్రచార బాట పట్టింది. 40 ఏళ్ల వారి కుటుంబ రాజకీయ జీవితంలో ఆమె ఏ రోజూ ప్రచారంలో పాల్గొనలేదు. మొదటిసారిగా తన కుమారుడి తరఫున జనంలోకి వచ్చారు. పరిగి అసెంబ్లీ స్థానం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి అత్యధికంగా ఐదుసార్లు శాసన సభ్యునిగా గెలుపొందిన కొప్పుల హరీశ్వర్‌రెడ్డి ఇప్పుడు తనయుడికి పగ్గాలిచ్చి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. భర్త హరీశ్వర్‌రెడ్డి కోసం ఎప్పుడూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనని ఆయన సతీమణి గిరిజాదేవి తనయుడు కొప్పుల మహేష్‌రెడ్డి కోసం ప్రచార బాటపట్టారు. ఆయనను ఎమ్మెల్యేగా చూడాలనే కాంక్షతో ఇంటిల్లిపాది శ్రమిస్తున్నారు. హరీశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేగా పోటీచేసిన ప్రతిసారి ప్రచారంలో అన్నీతానై వ్యవహరించే వారు. ఇద్దరు తనయులు మహేశ్‌రెడ్డి, అనిల్‌రెడ్డిలు సైతం ఏ రోజూ మైకు పట్టుకుని ప్రచారం చేసే వారు కాదు. కేవలం వారు తెరవెనక వ్యవహారాలు మాత్రమే చూసేవారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో పాటు బంధుగణం అందరు ప్రచారంలో చెమట చిందిస్తున్నారు. సోదరుడు అనిల్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి భార్య ప్రతిమారెడ్డి, బాబాయ్ నాగిరెడ్డి తదితర కుటుంభ సభ్యులందరూ మహేశ్‌రెడ్డి కోసం కష్టపడుతున్నారు. ఆయన తల్లి గిరిజాదేవి టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకుల్లో నూతనోత్తేజాన్ని నింపుతున్నారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానప్పటికీ ప్రతి ముఖ్యకార్యకర్తను గుర్తుపట్టగలరు. నాయకులు, కార్యకర్తల ఇళ్లలో శుభకార్యాలకు ఆమె వెళ్లేవారు. ఆ పరిచయాలతో ఇప్పుడు ప్రచారం చేయడం సులువుగా మారింది. -
‘కొప్పుల’ కంటతడి
టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో హరీశ్వర్‌రెడ్డి భావోద్వేగం పరిగి: టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, వికారాబాద్ జిల్లా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి పార్టీ శ్రేణుల సాక్షిగా కంటతడి పెట్టారు. పరిగిలో శనివారం నిర్వ హించిన పార్టీ సభ్యత్వ నమోదులో నాయ కులు, కార్యకర్తలు అధిష్ఠానం తీరుపై విమర్శ నాస్త్రాలు సంధించారు. ఉద్యమదశ నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి, తమను ముందుండి నడిపించిన నేతను గుర్తించక పోవడం బాధాకరమని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వేల సంఖ్యలో హాజరైన కార్యకర్తలనుద్దేశించి హరీశ్వర్‌రెడ్డి మాట్లాడు తూ.. ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. తనకేపదవి వద్దని, కార్యకర్తల అభిమానం ఉంటే చాలంటూ కంటతడిపెట్టారు. సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని, పదవి రానందుకు నిరుత్సాహ పడొద్దని మరింత కసితో పని చేద్దాం.. అంటూ కార్యకర్తల కు పిలుపునిచ్చారు. అంతకు ముందు మాట్లాడిన పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సైతం హరీశ్వర్‌రెడ్డికి పదవి దక్కకపోవడం బాధ కలిగించిందన్నారు. టీడీపీతో విభేదించి.. తెలంగాణ ఉద్యమం సమయంలో చంద్ర బాబుతో విభేదించిన హరీశ్వర్‌రెడ్డి టీఆర్ఎస్ గూటికి చేరారు. ఉద్యమంతో పాటు ఎన్నికల సమయంలో పార్టీ తరఫున పెద్దన్న పాత్ర పోషించారు. అయితే, అనూహ్య పరిణామా లతో ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అయినప్ప టికీ ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో తాజా నామినేటెడ్ పదవుల్లోనైనా ఏదో ఒకటి దక్కుతుందని ఆశించి భంగపడ్డారు.