ఇంటర్‌ బోర్టుపై కోమటిరెడ్డి ఫైర్‌

Komatireddy Venkat Reddy Fires On Telangana Inter Board - Sakshi

సాక్షి, నల్గొండ : తెలంగాణ ఇంటర్‌ బోర్డు నిర్లక్ష్యంపై కాంగ్రెస్‌ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్‌ అయ్యారు. తెలంగాణలో ప్రభుత్వం లేదనడానికి ఇంటర్ ఫలితాలే నిదర్శనమని, ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దీనిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి,  తమ జిల్లా వ్యక్తి కావడం సిగ్గుచేటన్నారు. ఆయనను వెంటనే మంత్రి పదవినుంచి డిస్మిస్ చెయ్యాలని డిమాండ్ చేశారు.

రెవెన్యూశాఖను ముఖ్యమంత్రి వద్ద ఉంచుకొని అవినీతి జరుగుతుందని చెప్పడం సిగ్గుచేటన్నారు. రెవిన్యూ శాఖ మంత్రిని వెంటనే నియమించాలని డిమాండ్‌ చేశారు. నాయకులు వెళ్లిపోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఏమీకాదని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top