రుణమాఫీ ఎందుకు చేయరు: కిషన్ రెడ్డి | kishan reddy blames trs sarkar | Sakshi
Sakshi News home page

రుణమాఫీ ఎందుకు చేయరు: కిషన్ రెడ్డి

Jul 28 2015 1:10 AM | Updated on Sep 3 2017 6:16 AM

రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో పుష్కలంగా నిధులుంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రుణమాఫీ ఎందుకు చేయడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో పుష్కలంగా నిధులుంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రుణమాఫీ ఎందుకు చేయడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, విత్తనాల కొ రత, ఎరువుల కొరత, రుణాలు దొర క్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటు న్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు.
 
 ఇద్దరు రైతులు బలవన్మరణం


 యాలాల: అప్పులబాధ తాళలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా యాలాల మండలం జక్కేపల్లివాసి కె.ఆశప్ప(32), కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం పోచెట్టిపల్లివాసి జి.తిరుపతి(45) ఆత్మహత్య చేసుకు న్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement