ఈ అభాగ్యుడ్ని ఆదుకోండి... | kidney failure patient seek for help | Sakshi
Sakshi News home page

ఈ అభాగ్యుడ్ని ఆదుకోండి...

Oct 17 2014 2:42 AM | Updated on Sep 2 2017 2:57 PM

ఈ అభాగ్యుడ్ని ఆదుకోండి...

ఈ అభాగ్యుడ్ని ఆదుకోండి...

రెండు కిడ్నీలు పాడైపోయి ఓ పేద యువకుడు దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు.

సికింద్రాబాద్: రెండు కిడ్నీలు పాడైపోయి ఓ పేద యువకుడు దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. మారేడుపల్లి డివిజన్ ఈస్ట్‌మారేడుపల్లిలోని వడ్డెర బస్తీలో నివాసం ఉంటున్న గోవింద్(21)కు ఒక కిడ్నీ పూర్తిగా రెండో కిడ్నీ 70 శాతం దెబ్బతిన్నది. గోవింద్ తండ్రి సరవయ్య రిక్షా కార్మికుడు. తల్లి శకుంతల ఇళ్లలో పాచిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గోవింద్ అనారోగ్యం ఆ కుటుంబానికి శాపంగా మారింది.

ఇటీవల గాంధీ ఆస్పత్రిలో చికిత్సలు జరిపినా...కనీసం ఒక్క కిడ్నీ అయినా మార్పు చేయాల్సిందేనని వైద్యులు తేల్చి చెప్పారు. అయితే, కిడ్నీ మార్పు ఖర్చుతోకూడుకున్నదని, అంత స్థోమత తమకు లేదని గోవింద్ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. ఎవరైనా దాతలు సహాయం చేసి (ఫోన్: 9502901819) ఆదుకోవాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement