నగరంలో కిడ్నాప్ కలకలం | Kidnapped boy released | Sakshi
Sakshi News home page

నగరంలో కిడ్నాప్ కలకలం

Dec 21 2015 3:21 PM | Updated on Sep 3 2017 2:21 PM

ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి మూడు గంటల అనంతరం వదిలిపెట్టారు.

హైదరాబాద్ : ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి మూడు గంటల అనంతరం వదిలిపెట్టారు. ఈ సంఘటన నగరంలోని చింతల్ సాయి నగర్ కాలనీలో సోమవారం కలకలం రేపింది. స్థానిక కాలనీకి చెందిన శ్రీను, సింగమ్మల కుమారుడు నాలుగేళ్ల సాయి నవదీప్ ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు.

తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతకగా.. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో సుచిత్ర వద్ద వదిలి వెళ్లారు. ఇది గుర్తించిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో బాలుడు సురక్షితంగా వారి వద్దకు చేరుకున్నాడు. దీంతో బాధితులు జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement