బంగారం కోసం వెళితే విషాదం.. సైనెడ్‌ తాగిన చిన్నారి | Young child consumes cyanide at a gold shop in Hyderabad | Sakshi
Sakshi News home page

బంగారం కోసం వెళితే విషాదం.. సైనెడ్‌ తాగిన చిన్నారి

Oct 10 2026 2:34 PM | Updated on Oct 10 2026 2:57 PM

Young child consumes cyanide at a gold shop in Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: జీడిమెట్ల తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ రోజు శనివారం ప్రమాదవశాత్తు సైనెడ్‌ తాగి చిన్నారి మృతిచెందింది. వివరాల్లోకి వెళితే.. చింతల్‌లోని ఓ జ్యువెల్లరీ షాపులో గోల్డ్‌ను మెరుగుపెట్టేందుకు ఓ దుకాణదారుడు సైనెడ్‌ తెచ్చాడు. అయితే ఆ సమయంలో ఒక మహిళ తన కుమార్తెతో పాటు బంగారం కొనుగోలు చేయడానికి వచ్చింది. 

ఆ సమయంలో అక్కడే ఉన్న సైనెడ్‌ను అనుకోకుండా చిన్నారి తాగి మృతిచెందింది. దీంతో వారి బంధువులు జ్యువెల్లరీ షాపు ముందు ఆందోళన చేపట్టారు.  ఈ వివరాలు తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: 9 రాష్ట్రాల్లో సైబర్‌ క్రైమ్‌ దాడులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement