హైదరాబాద్‌లో కేరళ భవన్ | Kerala Bhavan in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో కేరళ భవన్

Feb 2 2015 7:02 AM | Updated on Aug 15 2018 9:27 PM

మహేంద్రహిల్స్‌లో ఎకరం భూమి కేటాయించి, దాని నిర్మాణానికి కోటి రూపాయల నిధులు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

  • నిరుపేద మలయాళీలకు పక్కా ఇళ్లు కట్టిస్తాం: కేసీఆర్
  • సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మలయాళీ అసోసియేషన్ భవనం కోసం మహేంద్రహిల్స్‌లో ఎకరం భూమి కేటాయించి, దాని నిర్మాణానికి కోటి రూపాయల నిధులు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. నగరంలో నివసిస్తున్న నిరుపేద మలయాళీలకు పక్కా ఇళ్లు కట్టిస్తానని సీఎం హామీ ఇచ్చారు. కేరళ ప్రభుత్వ సహకారంతో నగరంలోని మలయాళీ అసోసియేషన్(సీటీఆర్‌ఎంఏ) ఆధ్వర్యంలో ఆదివారం బాలానగర్‌లోని నవీన సాంస్కృతిక కళా కేంద్రంలో కేరళీయం-2015 పేరుతో వేడుకలు జరిగాయి.

    ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో సుమారు 4 లక్షల మంది కేరళీయులు ఉన్నారని, వారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. తన చాంబర్‌లోనూ ఓఎస్డీగా కేరళకు చెందిన ప్రియాంక అద్భుతంగా సేవలందిస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు.  ఈ సందర్భంగా టీవీ యాంకర్ సుమతో పాటు పలువురు కేరళ ప్రముఖులను కేసీఆర్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కేరళ మంత్రి కె.సి.జోసఫ్, ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, బాల్క సుమన్ తదితరులు  పాల్గొన్నారు.
     

Advertisement
 
Advertisement
Advertisement