కేసీఆర్ భద్రాచలం పర్యటన నేడే | kcr visiting bhadrachalam today | Sakshi
Sakshi News home page

కేసీఆర్ భద్రాచలం పర్యటన నేడే

Mar 27 2015 8:11 AM | Updated on Aug 15 2018 9:27 PM

కేసీఆర్ భద్రాచలం పర్యటన నేడే - Sakshi

కేసీఆర్ భద్రాచలం పర్యటన నేడే

సీఎం కె.చంద్రశేఖర రావు శుక్రవారం భద్రాచలంలో పర్యటించనున్నారు.

హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర రావు శుక్రవారం భద్రాచలంలో పర్యటించనున్నారు. ఆయన నేరుగా హైదరాబాద్ నుంచి భద్రాచలం దాకా రోడ్డుమార్గంలోనే ప్రయాణించే యోచనలో ఉన్నట్లు సమాచారం. కేసీఆర్ మధ్యాహ్నం సూర్యాపేటలో భోజనవిరామం అనంతరం స్థానిక టీఆర్ఎస్ నాయకులతో సమావేశం కానున్నారు. అనంతరం ఖమ్మం జిల్లాలోని నేతలతో భేటీకానున్నారు. అదేరోజు రాత్రి భద్రాచలంలో బసచేయనున్నారు. అనంతరం కేసీఆర్ శనివారం ఉదయం స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొననున్నారు.  మధ్యాహ్నం మణుగూరులో విద్యుత్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయనున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత మొదటిసారి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తుండటం విశేషం.



 

Advertisement
 
Advertisement
Advertisement