ఫార్మా సిటీ ఏర్పాటుకు అవసరమైన స్థలాల అన్వేషణ కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ఫార్మా సంస్థల ప్రతినిధులతో కలసి బుధవారం ముచ్చెర్ల ప్రాంతంలో ఏరియల్ సర్వే చేయనున్నారు.
సాక్షి, హైదరాబాద్: ఫార్మా సిటీ ఏర్పాటుకు అవసరమైన స్థలాల అన్వేషణ కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ఫార్మా సంస్థల ప్రతినిధులతో కలసి బుధవారం ముచ్చెర్ల ప్రాంతంలో ఏరియల్ సర్వే చేయనున్నారు. వీరంతా మొత్తం నాలుగు హెలికాప్టర్లలో ఉదయం 11.45 గంటలకు బేగంపేట నుంచి బయలుదేరి 12.15 గంటలకు ముచ్చెర్లకు చేరుకుంటారు. అక్కడ పరిశ్రమల ఏర్పాటుపై సీఎం నేతృత్వంలో ఇష్టాగోష్టి నిర్వహిస్తారు. తొలుత రాచకొండ ప్రాంతాన్ని కూడా ఏరియల్ సర్వే చేయాలని అధికారులు భావించినా.. ఏదో కారణంతో దానిని విరమించుకున్నారు.