ప్రకాశ్‌ జవదేకర్‌తో కేసీఆర్‌ భేటీ 

KCR Met Minister Prakash Javadekar In New Delhi - Sakshi

పర్యావరణ అనుమతులిచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పిన కేసీఆర్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. బుధవారం కేంద్ర మంత్రిని కలసిన సీఎం రాష్ట్రంలోని పలు సాగునీరు, ఇతర ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పలు ప్రతిపాదనలను పరిష్కరించాల్సిందిగా కోరారు. ఫార్మాసిటీకి సంబంధించిన అంశం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు తెలంగాణ భవన్‌ వర్గాలు వెల్లడించాయి. సీఎం కేసీఆర్‌ వెంట టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, మన్నె శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top