తీవ్ర అనిశ్చితిలో ఆర్థిక పరిస్థితి: కేసీఆర్‌

KCR Letter To Nirmala Sitharaman On Telangana Economy Situation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర అనిశ్చితిలో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేఖ రాశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావడం లేదని తెలిపారు. ఈ ఏడాది రూ.2957కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు. కేంద్ర పన్నుల వాటా గణనీయంగా తగ్గిందని అన్నారు. కాగా అన్ని శాఖల్లో ఖర్చులు తగ్గించుకోవాలని ఆర్థిక మంత్రికి కేసీఆర్‌ సూచించారు. ఈ విషయమై త్వరలో ప్రధానిని కలిసి వివరిస్తానని కేసీఆర్‌ వెల్లడించారు. ఈ నెల 11న జరిగే తెలంగాణ కేబినెట్ సమావేశానికి పూర్తి సమాచారంతో రావాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top