సమైక్య రాష్ట్రంలో గిరిజనులకు అన్యాయం: కేసీఆర్ | kcr lay foundation for three Bhavans at Banjara Hills | Sakshi
Sakshi News home page

సమైక్య రాష్ట్రంలో గిరిజనులకు అన్యాయం: కేసీఆర్

Dec 11 2014 2:36 PM | Updated on Aug 15 2018 9:04 PM

అందరికి సమాన హక్కులు కల్పించేందుకు ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

హైదరాబాద్ : అందరికి సమాన హక్కులు కల్పించేందుకు ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన గురువారం బంజారాహిల్స్‌లోని రోడ్ నం.10 లో బంజారా, ఆదివాసీ భవన్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి బంజారా, ఆదివాసీ భవన్లను నిర్మిస్తున్నామన్నారు.

కమ్యూనిటీ హాల్ కట్టుకోగానే సరిపోదని, అది గిరిజనుల అభివృద్ధికి వేదిక కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. సమైక్య రాష్ట్రంలో గిరిజనులకు అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. ట్రైబల్ సబ్ప్లాన్ నిధులు మళ్లించబడవని కేసీఆర్ తెలిపారు. అంతకు ముందు కేసీఆర్కు బంజారాలు, ఆదివాసీలు డబ్బులు, వాయిద్యాలతో సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆహ్వానం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement