తెలంగాణ బాహుబలి కేసీఆరే: కవిత | kcr is the baahubali of telangana, says mp kavitha | Sakshi
Sakshi News home page

తెలంగాణ బాహుబలి కేసీఆరే: కవిత

Mar 18 2017 6:36 PM | Updated on Aug 14 2018 11:02 AM

తెలంగాణ బాహుబలి కేసీఆరే: కవిత - Sakshi

తెలంగాణ బాహుబలి కేసీఆరే: కవిత

కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే బాహుబలులు కావాలేమో గానీ.. తెలంగాణకు, టీఆర్ఎస్‌కు తమ ముఖ్యమంత్రి కేసీఆరే అసలైన బాహుబలి అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే బాహుబలులు కావాలేమో గానీ.. తెలంగాణకు, టీఆర్ఎస్‌కు తమ ముఖ్యమంత్రి కేసీఆరే అసలైన బాహుబలి అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఎప్పుడో వచ్చే బాహుబలి కోసం కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తోందని, తమవద్ద బాహుబలి ఎప్పటినుంచో ఉన్నారని ఆమె అన్నారు.

టీఆర్‌ఎస్‌ను ఓడించడానికి, కేసీ ఆర్‌ను ఎన్నికల్లో కొట్టడానికి రాష్ట్రంలోనూ ఒక బాహుబలి వస్తాడేమోనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రతిపక్ష నేత జానారెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే.. జానారెడ్డే తమ బాహుబలి కావచ్చని నల్లగొండ జిల్లాకే చెందిన మరో సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రజలకు బాహుబలి మానియా పట్టిందని జానారెడ్డి కూడా బాహుబలి గురించి మాట్లాడి ఉంటారని అన్నారు. ఆ బాహుబలి జానారెడ్డే కావొచ్చు, మరెవరైనా కావొచ్చునని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement