ఉపాధ్యాయుల సేవలు దేశానికి ఎంతో అవసరం : సీఎం | KCR greets Teachers on the occasion of 'Teachers Day' | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల సేవలు దేశానికి ఎంతో అవసరం : సీఎం

Sep 5 2017 12:08 PM | Updated on Aug 15 2018 9:40 PM

ఉపాధ్యాయుల సేవలు దేశానికి ఎంతో అవసరం : సీఎం - Sakshi

ఉపాధ్యాయుల సేవలు దేశానికి ఎంతో అవసరం : సీఎం

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

హైదరాబాద్ : భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ఉపాధ్యాయులు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువచ్చేందుకు సర్వేపల్లి రాధాకృష్ణన్ చేసిన సేవలను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. విద్యార్థుల జీవితంలో టీచర్ల పాత్ర ఎంతో కీలకమైందని, విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో టీచర్లు ప్రధాన పాత్ర పోషిస్తారని సీఎం అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement