
విమెన్ బైక్ రైడర్లను అభినందిస్తున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విమెన్ బైక్‌రైడర్స్ జయ్ భారతి, శాంతి సుసన్, శిల్పా బాలకృష్ణన్, పియా బహదూర్ 6 దేశాల్లో 56 రోజులపాటు 17 వేల కిలోమీటర్ల బైక్ యాత్రను ముగించుకున్న సందర్భంగా శనివారం ఇక్కడ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ వారిని అభినందించారు. ఫిబ్రవరి 18న పర్యాటకభవన్ నుంచి యాత్రను ప్రారంభించి భారత్, మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్, వియత్నాం, కంబోడియా దేశాల్లో పర్యటించారు. ఏప్రిల్ 8న వారు తిరిగి భారత్‌కు చేరుకున్నారు.