
8వసారి పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్..
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వరుసగా ఎనిమిదోసారి ఎన్నికయ్యారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వరుసగా ఎనిమిదోసారి ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ పేరును ప్లీనరీలో శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ పేరును అధికారికంగా ప్రకటించగానే పార్టీ నేతలు ఆయనను అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా కేసీఆర్కు తలపాగ, నాగలి బహుకరించారు.