కత్తి మహేష్‌పై మిల్స్‌కాలనీ పీఎస్‌లో ఫిర్యాదు

Kathi Mahesh Complaint On Police Station In Warangal - Sakshi

కరీమాబాద్‌: ‘శ్రీరాముడు దగుల్బాజీ..సీతమ్మ రావణుడితోనే ఉంటే బాగుండేదని’ హైందవుల మనోభావాలను దెబ్బతీసేలా ఓ ప్రైవేట్‌ టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై ఆదివారం నగరంలోని మిల్స్‌కాలనీ పోలీస్టేషన్‌లో లేబర్‌కాలనీకి చెందిన అడ్వకేట్‌ బాలినె శ్రీనివాస్‌రావు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కత్తి మహేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఐ నందిరామ్‌ను వినతిపత్రంలో కోరినట్లు శ్రీనివాస్‌రావు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు పుప్పాల రాజేందర్‌ ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top