ఖమ్మంలో కార్తీ సందడి | Karthi In Khammam | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో కార్తీ సందడి

Jul 17 2018 11:41 AM | Updated on Aug 9 2018 7:30 PM

Karthi In Khammam - Sakshi

సెల్ఫీలు దిగేందుకు చుట్టుముట్టిన అభిమానులు 

ఖమ్మంకల్చరల్‌ : ప్రముఖ తమిళ హీరో, సూర్య సోదరుడు, కార్తీ ఖమ్మంలో సోమవారం సందడి చేశారు. ఆయన నటించిన చినబాబు చిత్రం ప్రదర్శితమవుతున్న ఆదిత్య థియేటర్‌కు విచ్చేయడంతో ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. చిత్ర యూనిట్‌ సభ్యులతో కలిసి సినిమా హాల్‌ లోపల అభిమానులందరికీ కార్తీ అభివాదవం చేస్తూ పలకరించారు. ఈ సందర్భంగా కార్తీ మాట్లాడుతూ..కళాకారుల గుమ్మం ఖమ్మంలో విజయోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

సినిమాను, తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకునేందుకు ఇక్కడికి వచ్చానన్నారు. ఎల్లప్పుడూ ఇదే ఆదరాభిమానాలను కొనసాగించాలని కోరారు. అనంతరం థియేటర్‌ వారు ఏర్పాటు చేసిన కేక్‌ను కట్‌ చేశారు. మహిళలకు హీరోకార్తీ చీరలు పంపిణీ చేశారు.

తమ హీరోతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు, కరచాలనం చేసేందుకు అంతా ఉత్సాహం చూపారు. కార్యక్రమంలో చిత్ర సహ నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి, థియేటర్‌ యజమాని కాంపాటి పిచ్చయ్య, మేనేజర్‌ బెల్లంకొండ శ్రీనివాస్, హీరో కార్తీ అభిమాన సంఘం నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement