రేవంత్ రెడ్డికి లగడపాటికి పట్టిన గతే పడుతుంది | Karne Prabhakar takes on Telangana TDP Leaders | Sakshi
Sakshi News home page

రేవంత్ రెడ్డికి లగడపాటికి పట్టిన గతే పడుతుంది

Oct 11 2014 3:21 PM | Updated on Aug 11 2018 4:44 PM

రేవంత్ రెడ్డికి లగడపాటికి పట్టిన గతే పడుతుంది - Sakshi

రేవంత్ రెడ్డికి లగడపాటికి పట్టిన గతే పడుతుంది

తెలంగాణలో విద్యుత్ కష్టాలకు కాంగ్రెస్, టీడీపీలే కారణమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు.

హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ కష్టాలకు కాంగ్రెస్, టీడీపీలే కారణమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. శనివారం హైదరాబాద్లో కర్నె ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ... యాత్రల పేరిట కాంగ్రెస్, టీడీపీ నేతలు రైతులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీ.టీడీపీ నేతలు బానిసలుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. లేకుంటే భవిష్యత్తులో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్కి పట్టిన గతే రేవంత్ రెడ్డికి కూడా పడుతుందని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement