ఇక్కడ కల్లు కూడా డోర్‌డెలవరీ | kallu door delivery in karimnagar | Sakshi
Sakshi News home page

ఇక్కడ కల్లు కూడా డోర్‌డెలవరీ

Mar 5 2017 11:36 AM | Updated on Sep 5 2017 5:17 AM

ఇక్కడ కల్లు కూడా డోర్‌డెలవరీ

ఇక్కడ కల్లు కూడా డోర్‌డెలవరీ

కల్లును క్యాన్లలో తెచ్చి ఇంటింటికీ తిరుగుతూ విక్రయిస్తున్నారు.

కరీంనగర్‌సిటీ: పల్లెటూళ్ల నుంచి పట్టణాలకు వాహనాలపై ఇంటింటికీ పాలు తీసుకురావడం చూశాం. కూరగాయలు తెచ్చి వాడవాడలా విక్రయించడం చూస్తూనే ఉన్నాం. అయితే తాటి, ఈత కల్లును సైతం క్యాన్లలో తెచ్చి ఇంటింటికీ తిరుగుతూ విక్రయించడం కొత్తగా చూస్తున్నాం. గ్రామాల్లో రోజూ గౌడలు ఇంటికి ‘వాడుక’ పేరిట కల్లు తెచ్చివ్వడం తెలిసిందే.

కరీంనగర్‌లోనూ పాలు, నీళ్ల మాదిరిగానే కల్లును సైతం ఇంటింటికీ తెచ్చి విక్రయిస్తున్నారు. మినరల్‌ వాటర్‌ తెచ్చుకునే బబూల్స్‌లో కల్లు తీసుకొచ్చి లీటర్, రెండు లీటర్ల బాటిళ్లలో నింపి విక్రయిస్తున్నారు. రెండు లీటర్ల బాటిల్‌కు రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు. ఆ ఊరుది..ఈ ఊరుది అంటూ కల్లుకు పేరున్న ప్రాంతాల పేరు చెబుతూ విక్రయిస్తుండడం కొసమెరుపు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement