బాహుబలి మూడో మోటార్‌ వెట్‌రన్‌ | Kaleshwaram Project Gayatri Pump House Wetrun Started At Karimnagar | Sakshi
Sakshi News home page

బాహుబలి మూడో మోటార్‌ వెట్‌రన్‌

Oct 20 2019 1:28 AM | Updated on Oct 20 2019 1:28 AM

Kaleshwaram Project Gayatri Pump House Wetrun Started At Karimnagar - Sakshi

రామడుగు (చొప్పదండి): కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీపూర్‌ గ్రామ గాయత్రి పంపు హౌస్‌లోని బాహుబలి మూడో విద్యుత్‌ మోటారుకు శనివారం సాయంత్రం అధికారులు వెట్‌రన్‌ నిర్వహించారు. సాయంత్రం 6.18 గంటలకు మోటార్‌ను ఆన్‌చేసి నీటిని ఎత్తిపోశారు.పంపుహౌస్‌లో ఏడు బాహుబలి విద్యుత్‌ మోటార్లు ఏర్పాటు చేయగా..ఇప్పటికే 1, 2, 4, 5, 6 మోటార్లను వెట్‌రన్‌ విజయవంతంగా చేశారు. తాజా మరో మోటారు వెట్‌రన్‌ విజయవంతంగా నిర్వహించారు.దీంతో ఆరు మోటార్ల వెట్‌రన్‌ పూర్తయింది.చివరి మోటారు వెట్‌రన్‌కు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు, రాష్ట్ర సాంకేతిక సలహాదారు పెంటారెడ్డి, ఈఈ నూనె శ్రీధర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement