‘రైతు మేలు కోరి కేసీఆర్‌ సాహసోపేత నిర్ణయం’

Kadiyam Srihari Comments On Warangal Development - Sakshi

భూ రికార్డుల ప్రక్షాళనపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

సాక్షి, వరంగల్‌ అర్బన్‌ : రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌ నగర సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. నగరం చుట్టూ జాతీయ రహదారిని అనుసంధానం చేస్తూ 1,446 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 74 కిలోమీటర్ల ఔటర్‌ రింగురోడ్డును మంజూరు చేశారని అన్నారు. వరంగల్‌ను సాహిత్యం, సంస్కృతి హబ్‌గా తీర్చిదిదుద్దటకు హన్మకొండలో 50 కోట్ల రూపాయలతో కాళోజీ కళాక్షేత్రం నిర్మించనున్నామని వెల్లడించారు. బుధవారం కడియం మీడియాతో మాట్లాడారు.

3227 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన  10.78 టిఎంసీల నీటి నిల్వ సామర్థ్యంగల లింగంపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే 10 లక్షల ఎకరాలకు సాగునీరు, వరంగల్‌ నగరానికి తాగునీరు అందించడానికి మార్గం సగమం అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పరిపాలన అనుమతులు వచ్చాయని వెల్లడించారు. భూ రికార్డుల్లోని లోపాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ఎందరో రైతుల మేలుకోరి సీఎం కేసీఆర్‌ భూ రికార్డుల ప్రక్షాళన చేయాలనే సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమం కింద కోటి 40 లక్షల ఎకరాల భూములకు పట్టాదార్‌ పాసుపుస్తకాలు ఇచ్చామని తెలిపారు. రైతుబీమా పథకంలో భాగంగా జిల్లాలో 43,510 రైతులకు బీమా పథకం పత్రాలను అందజేశామని వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top