కేసులకు అనుగుణంగా కోర్టుల పెంపు 

Justice Raghvendra Singh Chauhan Says Courts Increasing According To Cases - Sakshi

హైకోర్టు తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ 

నల్లగొండ లీగల్‌: రాష్ట్రంలో పెరుగుతున్న కేసులకు అనుగుణంగా కోర్టుల సంఖ్యను పెం చుతున్నట్లు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ తెలిపారు. మంగళవారం నల్లగొండలోని బార్‌ అసోసియేషన్‌ సమావేశ మందిరంలో న్యాయవాదులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. జూనియర్‌ న్యాయవాదులు నిరంతరం అధ్య యనం చేస్తూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. భూ సేకరణ కేసుల పరిష్కారానికి త్వరలో జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ వేదిక కానుందని తెలిపారు. న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా విస్తృతంగా ప్రజలకు న్యాయ సహాయం అందించాలని సూచించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top