'అధికారమదంతో గూండాయిజం సరికాదు' | janareddy condemn the trs mla balaraju attacks | Sakshi
Sakshi News home page

'అధికారమదంతో గూండాయిజం సరికాదు'

Sep 4 2015 8:24 PM | Updated on Mar 18 2019 8:57 PM

కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దాడిని తెలంగాణ అసెంబ్లీ ప్రతిపక్షనేత కె.జానారెడ్డి తీవ్రంగా ఖండించారు.

హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దాడిని తెలంగాణ అసెంబ్లీ ప్రతిపక్షనేత కె.జానారెడ్డి తీవ్రంగా ఖండించారు. అధికారమదంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూండాయిజం చేయడం సరికాదని సూచించారు. టీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు జోక్యం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే దాడి ఘటన స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే బాలరాజుపై కేసు నమోదు చేయాలని జానారెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement